: చైనా దూసుకొస్తోంది జాగ్రత్త: భారత్ ను హెచ్చరించిన పెంటగాన్

తమ దేశానికి భారత్ తో ఉన్న సరిహద్దుల వెంట చైనా మరిన్ని భద్రతా దళాలను మోహరిస్తోందని, సరిహద్దులకు సమీపాన శాశ్వత సైనిక కేంద్రాలను నిర్మిస్తూ, అక్కడికి భారీ ఎత్తున ఆయుధాలను చేరుస్తోందని యూఎస్ మిలటరీ అధికారులు హెచ్చరించారు. దీనివల్ల భారత్ భవిష్యత్తు ప్రమాదంలో పడే ప్రమాదముందని హెచ్చరించింది. "ఇండియా సరిహద్దు వెంట చైనా సైనిక కార్యకలాపాలపై మేము హెచ్చరించాం. ఆ ప్రాంతంలో చైనా సైనికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది" అని డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అబ్రహాం ఎం డెన్మార్క్ వెల్లడించారు. ఈ మేరకు పెంటగాన్ తరఫున 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్ మెంట్స్ ఇన్వాల్వింగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' అంశంపై నివేదిక ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే, చైనా కార్యకలాపాల వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న విషయం తేల్చడం ప్రస్తుతానికి కష్టమని వివరించారు.

More Telugu News