: ప్రభుత్వ ఉద్యోగులు మరింత లక్కీ... 7వ వేతన సంఘ సిఫార్సుల కన్నా అధిక మొత్తం చేతికి!

ఈ వార్త 7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు పెరిగిన వేతనాలను అందుకోనున్న ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఆనందాన్ని కలిగించేదే. వేతన సంఘ సిఫార్సుల మేరకు వేతనాలు తమకు సరిపోవని ఉద్యోగులు వాదిస్తున్న వేళ, కేంద్ర కార్యదర్శుల గ్రూప్ ఈ సిఫార్సులను సమీక్షించి కొత్త నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ నివేదిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే బయటకు వస్తుందని సమాచారం. ఈ నివేదికలో 7వ వేతన సంఘం సిఫార్సుల కన్నా అధికంగా వేతనాలు పెంచాలన్న నిర్ణయం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోయర్ లెవల్ లో కనీసం రూ. 21 వేలు, హయ్యర్ లెవల్ లో రూ. 2.70 లక్షల పెంపును కార్యదర్శుల గ్రూప్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. 7వ పే కమిషన్ సిఫార్సులతో పోలిస్తే, అప్పర్ లిమిట్ లో ఇది రూ. 20 వేలు అధికం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 52 లక్షల మంది పెన్షనర్లకు మరింత లబ్ధి చేకూరనుంది.

More Telugu News