: బ్రిటన్ యువరాణి 'మార్లిన్ మన్రో' మామెంట్... ఎన్ని అవస్థలో!

ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్, అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించే కార్యక్రమంలో గాలికి ఎగిరిపోతున్న తన ఫ్రాక్ ను సర్దుకోలేక నానా అవస్థలూ పడ్డారు. ఈ ప్రాంతంలో గాలి బాగా వీస్తుండటంతో ఆమె వేసుకున్న దుస్తులు ఎగురుతుండగా, వాటిని సర్దుకునే క్రమంలో, హాలీవుడ్ వెటరన్ అందాల సుందరి మార్లిన్ మన్రో ఐకానిక్ పోజు ('సెవన్ ఇయర్స్ ఇచ్' సినిమాలోని సబ్ వే సీన్) ఇవ్వాల్సి రాగా, ఆ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అమరజ్యోతి వద్ద నివాళి అర్పిస్తున్న సమయంలోనూ తన గౌనును సర్దుకునే పనిలోనే ఉండాల్సి రావడంతో కేట్ కాస్తంత ఇబ్బంది పడ్డారు.

More Telugu News