ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నెల్లూరులో పవర్ స్టార్ అభిమానులపై విరిగిన లాఠీ... ఒకరికి గాయాలు

Fri, Apr 08, 2016, 07:12 AM
టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ కు ముందే ఏపీలోని పలు ప్రాంతాల్లో సందడి వాతావరణానికి తెర తీసింది. విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైన థియేటర్ల ముందు నిన్న సాయంత్రం నుంచే క్యూ కట్టిన అభిమానులు బెనిఫిట్ షోలకు ఎగబడ్డారు. అర్ధరాత్రి మొదలైన బెనిఫిట్ షోలు పవర్ స్టార్ అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో టెకెట్ల కోసం నెల్లూరులోని ఓ థియేటర్ వద్ద ఎగబడ్డ పవన్ అభిమానులపై పోలీసులు లాఠీ చార్జీ జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ ను పిలిపించిన పోలీసులు సదరు అభిమానిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ సందడి నెలకొన్నా పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Articles (Latest)
Articles (Education)