ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అందగత్తెను... రూ. 100 కోట్లు సంపాదించే వాడు భర్తగా కావాల'ని కోరిన యువతి... ముఖేష్ అంబానీ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఆన్సర్!

Thu, Apr 07, 2016, 04:26 PM
ఓ అందమైన యువతి... తనకు సంవత్సరానికి రూ. 100 కోట్లు సంపాదించేవాడు భర్తగా రావాలని కోరుకుంది. తన కోరికను సామాజిక మాధ్యమాల ద్వారా నలుగురితో పంచుకుంది. ఆ పోస్టు నెట్టింట వైరల్ అయి, వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీకి చేరింది. ఆయన దానికి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడాయన సమాధానం వైరల్.

ఆ యువతి పెట్టిన పోస్టు...
టైటిల్: నేను ధనవంతుడినే ఎందుకు పెళ్లి చేసుకోవాలి?
నేను ఇక్కడ ఏం చెబుతున్నానో నిజాయతీగా చెబుతున్నా. నాకిప్పుడు 25 సంవత్సరాలు. చాలా అందంగా ఉంటాను. మంచి అభిరుచులున్నాయి. సంవత్సరానికి రూ. 100 కోట్లకు మించిన వేతనమున్న యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. నాది అత్యాశ అని మీరు అనుకోవచ్చు. ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్న వారు నేటి తరంలో మధ్య తరగతి వారే.
ఇక్కడ ఎవరైనా రూ. 100 కోట్లు సంపాదిస్తూ, వివాహం చేసుకోని వారు ఉన్నారా? నేను డేటింగ్ చేసిన వారిలో రూ. 50 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు మాత్రమే ఉన్నారు. ఆ స్థాయి నాకు సరిపోదేమో. న్యూయార్క్ సిటీ గార్డెన్ పశ్చిమ ప్రాంతంలో ఓ నివాస గృహాన్ని కొనాలంటే, రూ. 50 కోట్ల ఆదాయం సరిపోదు. అందువల్ల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా? వీటికి సమాధానం తెలిస్తే చెప్పండి.
* ధనవంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు? (బార్లు, రెస్టారెంట్లు, జిమ్ ల చిరునామాలను దయచేసి చెప్పండి)
* ఏ వయసు వారిని నేను లక్ష్యంగా చేసుకోవాలి?
* ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారెందుకు? నేను కొందరు అమ్మాయిలను కలిశాను. వారంతా మామూలుగా కనిపించే వారే. అయినా ధనవంతులను పెళ్లి చేసుకున్నారు.
* ఎవరినైనా చూస్తే, భార్యగా చేసుకోవాలని ఏ కారణాలతో అనిపిస్తుంది? స్నేహితురాలిగా ఎవరిని ఉంచుకుంటారు? (నా టార్గెట్ మాత్రం పెళ్లి చేసుకోవడమే)
- పూజా చౌహాన్

ఇక ఈ పోస్టింగ్ చూసిన ముఖేష్ అంబానీ సమాధానం ఇది.

ప్రియమైన పూజా,
నీ పోస్టును ఆసక్తిగా చదివాను. నీలాంటి ప్రశ్నలు వేసే అమ్మాయిలు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఓ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ గా నీ పరిస్థితిని విశ్లేషించి ఈ సమాధానం ఇస్తున్నాను. నా వార్షికాదాయం రూ. 100 కోట్ల పైనే. ఇది నీ రిక్వైర్ మెంటుకు సరిపోతుంది. కాబట్టి నేను నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృథా చేసుకుంటున్నానని అనుకోవడం లేదు.
ఓ వ్యాపారవేత్తగా, నిన్ను వివాహం చేసుకోవడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. దీనికి సమాధానం చెప్పడం చాలా సులువు. ఇదే సమాధానం.
మిగతా విషయాలన్నీ పక్కన పెట్టు. నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. అంటే 'ఏ' అనే వ్యక్తి తన అందాన్ని ఇస్తే, 'బీ' దాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాలి. ఇక్కడో ప్రధానమైన సమస్య ఏంటంటే, నీ అందం రోజురోజుకూ తరిగిపోతుంది. నా ఆదాయం ఓ సరైన కారణం లేకుండా తగ్గదు. పైగా ప్రతియేటా నా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది.

ఇక ఆర్థిక కోణంలో పరిశీలిస్తే, నాది పెరిగే ఆస్తి, నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్ఠంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. ఇదే వాల్ స్ట్రీట్ పరిభాషలో చెప్పాలంటే, ప్రతి ట్రేడింగ్ కూ ఓ పొజిషన్ ఉంటుంది. డేటింగ్ కూడా ఓ ట్రేడింగ్ పోజిషనే.
ట్రేడ్ విలువ పడిపోతుంటే, దాన్ని దీర్ఘకాలం దగ్గరే ఉంచుకోవడం మంచి ఆలోచన అనిపించుకోదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే, అది మంచి ఆలోచన ఎంతమాత్రమూ కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి.

ఎవరికైనా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందంటే, అతడేమీ తెలివి తక్కువ వాడేమీ కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకిచ్చే సలహా ఏంటంటే, ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వదిలెయ్. నీకు నువ్వే రూ. 100 కోట్ల ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నించు. అప్పుడు నీ కోరిక తీరేందుకు మరింత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.
- ముఖేష్ అంబానీ
X

Feedback Form

Your IP address: 54.161.217.24
Articles (Latest)
Articles (Education)