: ఎప్పుడు ఇండియాకు వస్తారు? అసలు మీ ఆస్తి ఎంతో లెక్కచెప్పండి: మాల్యాకు సుప్రీం ఆదేశం

బ్యాంకులకు కట్టాల్సిన రూ. 9 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసి, ఆపై రూ. 4 వేల కోట్లు చెల్లిస్తానని న్యాయవాది ద్వారా తమ ముందుకు వచ్చిన విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు మండిపడింది. మాల్యా ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని బ్యాంకుల కన్సార్టియం స్పష్టం చేసిన నేపథ్యంలో సుప్రీం స్పందించింది. అసలు మాల్యా ఎప్పుడు ఇండియాకు రావాలని అనుకుంటున్నారని అడిగింది. ఈనెల 21లోగా, ఆయన ఆస్తిపాస్తుల వివరాలన్నీ కోర్టుకు అందించాలని ఆదేశించింది. నగదును డిపాజిట్ చేయమంటే ఏ మేరకు డబ్బు కట్టగలరో తెలపాలని కోరుతూ కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది. అంతకుముందు మాల్యా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ఆయన ఇండియాకు రావాలంటే కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి వుందని, 22వ తేదీలోగా ఎప్పుడు వచ్చేదీ ఆయన చెప్పగలరని తెలిపారు.

More Telugu News