: రోహిత్ అవుట్...టీమిండియా 62/1

వాంఖడే స్టేడియం వేదికగా ఆడనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మందకొడిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, అజింక్యా రహానే ఆచి తూచి ఆడారు. దీంతో మూడు ఓవర్లలో భారత్ స్కోరు 15. అనంతరం రోహిత్ శర్మ జూలు విదిల్చాడు. బెన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు, ఐదో ఓవర్ లో రహానే ఒక ఫోర్ బాదగా, తరువాత రస్సెల్ వేసిన ఓవర్ లో రోహిత్ ఒక సిక్సర్, ఫోర్ బాదాడు. దీంతో టీమిండియా స్కోరు బోర్డు వేగం పెరిగింది. ఏడు ఓవర్లు ఆడిన భారత్ జట్టు 62 పరుగులు చేయగా, ఎనిమిదో ఓవర్ తొలి బంతికి రోహిత్ ను బాద్రి ఎల్బీడబ్ల్యూగా బలిగొన్నాడు. దీంతో 62 పరుగుల వద్ద 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. రహానే 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కోహ్లీ వచ్చాడు.

More Telugu News