: మరింతగా తగ్గిన ముడి చమురు ధరలు!

ఒపెక్ దేశాల నుంచి ముడిచమురు మరింతగా సరఫరా అవుతుందన్న అంచనాల నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింతగా పడిపోయాయి. నేటి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లో యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారల్ కు 67 సెంట్లు పడిపోయి 36.51 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 62 సెంట్లు పడిపోయి 38.91 డాలర్లకు చేరింది. యూఎస్ లో నూతనంగా కనుగొన్న ముడి చమురు క్షేత్రాలపై వచ్చిన వార్తలు సైతం ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడపించాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, గతవారం ఆసాంతం పెరుగుతూ వచ్చిన క్రూడాయిల్ ధర రెండు సెషన్ల నుంచి తగ్గుతోంది.

More Telugu News