ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బడ్జెట్ 2016' ముఖ్యాంశాలు!

Mon, Feb 29, 2016, 12:03 PM
Related Image ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనల ముఖ్యాంశాలు...

* ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది.
* ఆర్థికమాంద్యం వేళ బలంగా కనిపిస్తున్న ఇండియా.
* మన బ్యాంకింగ్ వ్యవస్థ మూలాలు పటిష్ఠం.
* ద్రవ్యోల్బణం 9.6 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది.
* జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతానికి పెరిగింది.
* 2015లో 3.1 శాతానికి దిగజారిన అంతర్జాతీయ వృద్ధి రేటు.
* విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
* ప్రభుత్వం తెచ్చిన పంటల బీమాతో రైతులకు మరింత భరోసా.
* కీలక రంగాలకు అదనపు వనరులను సమకూర్చాం.
* గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్ విభాగాలకు ఆర్థికసాయం.
* 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధి మంత్రం.
* ప్రభుత్వ బ్యాంకులకు మూలధన నిధులిచ్చి బలోపేతం.
* మౌలిక సదుపాయాల మెరుగునకు మరిన్ని కేటాయింపులు.
* వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు.
* ప్రధాని సించాయ్ యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరు.
* వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు.
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు.
* నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువుల తయారీ.
* పప్పుధాన్యాల అభివృద్ధికి రూ. 500 కోట్లు.
* మరో 28.5 లక్షల ఎకరాలకు సాగునీరు
* వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి జనరల్ ఇన్స్యూరెన్స్ లో పబ్లిక్ ఇష్యూలు.
* ఇరిగేషన్ కోసం రూ. 17 వేల కోట్లు.
* భూసార పరీక్షల కోసం రూ. 268 కోట్లు.
* వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానంతో కేంద్ర ఖజానాపై భారం.
* వ్యవసాయం - ఉపాధి హామీల అనుసంధానం.
* గ్రామీణ రంగంలోని నిరుపేదలకు సహాయ సహకారాలు.
* రహదారుల నిర్మాణానికి రూ. 27 వేల కోట్లు.
* రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం.
* రైతు రుణాలపై రాయితీకి రూ. 15 వేల కోట్లు.
* వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఈ-మార్కెట్ ఏర్పాటు.
* దేశంలో మూడో వంతు ప్రజలకు బీమా సౌకర్యం.
* వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం.
* పాడి రైతుల కోసం రూ. 850 కోట్లు కేటాయింపు.
* నాబార్డు ఆధ్వర్యంలో రూ. 20 వేల కోట్లతో ఇరిగేషన్ నిధి.
* రైతులకు రుణాల లక్ష్యం రూ. 9 లక్షల కోట్లు.
* భూగర్భ జలాల పెంపునకు రూ. 60 వేల కోట్లు కేటాయింపు.
* గ్రామీణాభివృద్ధికి రూ. 2.97 లక్షల కోట్లు.
* 2018 మే 1లోగా అన్ని గ్రామాలకూ విద్యుత్.
* జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు.
* స్వచ్ఛ భారత్ కు రూ. 9 వేల కోట్లు.
* ప్రధాని గ్రామ సడక్ యోజన కోసం రూ. 19 వేల కోట్లు.
* 75 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాయి.
* ఇది ప్రతి భారత పౌరుడికీ గర్వకారణం. వారందరికీ కృతజ్ఞతలు.
* వచ్చే రెండేళ్లలో 5 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు.
* పేదల కోసం కొత్తగా ఆరోగ్య బీమా పథకం.
* ఒక్కో కుటుంబానికి రూ. లక్ష వరకూ ఆరోగ్య బీమా సౌకర్యం.
* 60 సంవత్సరాలు దాటిన వారికి అదనంగా మరో రూ. 30 వేల బీమా.
* మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా స్టాండప్ పథకం.
* పీపీపీ పద్ధతిలో నేషనల్ డయాలసిస్ సర్వీస్.
* దేశవ్యాప్తంగా 1500 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు.
* వీటికి అదనంగా 5,700 మల్టీ స్కిల్ కేంద్రాలు.
* మూడేళ్లలో కోటి మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
* సర్వశిక్షా అభియాన్ కింద కొత్తగా 62 నవోదయా విద్యాలయాల ఏర్పాటు.
* ఉన్నత విద్యకు రూ. 1000 కోట్లతో ఆర్థిక సహాయ నిధి.
* నకిలీ డిగ్రీలను అరికట్టేందుకు డిజిటల్ డిపాజిటర్ విధానం.
* ప్రధాని ఔషధ యోజన పేరిట కొత్త పథకం.
* దీని ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల మెడికల్ స్టోర్ల ఏర్పాటు.
* పేదలకు తక్కువ ధరలకే అన్ని రకాల ఔషధాలు అందిస్తాం.
* 10 వేల కి.మీ జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం.
* ఇందుకోసం రూ. 2.18 లక్షల కోట్ల కేటాయింపు.
* మౌలిక రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు
* తూర్పు, పశ్చిమ తీరాల్లో మరిన్ని నౌకాశ్రయాల నిర్మాణం.
* గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుల నిర్మాణానికి కట్టుబడ్డ ప్రభుత్వం.
* ఉపయోగంలో లేని ఎయిర్ పోర్టుల అభివృద్ధికి రూ. 150 కోట్లు.
* కొత్త ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై 8.33 శాతం వడ్డీ.
* మొదటి మూడేళ్లూ వడ్డీ భారం కేంద్రమే భరిస్తుంది.
* బహిరంగ మల మూత్ర విసర్జన లేని గ్రామాలకు పురస్కారాలు.
* గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపునకు చర్యలు.
* పంచాయతీలు, పురపాలక సంఘాలకు సాయంగా రూ. 2.87 కోట్ల గ్రాంటు.
* స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలకు రూ. 500 కోట్లు.
* అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులపై మరింత దృష్టి.
* ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజనకు రూ. 1,700 కోట్లు.
* సర్వీస్ కెరియల్ ప్లాట్ ఫాంతో రాష్ట్ర ఉపాధి కల్పనా కార్యాలయాల అనుసంధానం.
* చిన్న దుకాణాలకు వారంలో అన్ని రోజులూ వ్యాపారానికి అనుమతి.
* రైల్వేల అభివృద్ధికి రూ. 2.18 లక్షల కోట్లు.
* పాసింజర్ బస్సుల నిర్వహణకు కొత్త ప్రయోగం.
* రవాణా రంగంలో 'లైసెన్స్ రాజ్'కు స్వస్తి.
* పాసింజర్ రవాణా రంగంలో ప్రైవేటు సంస్థలకు పచ్చజెండా.
* చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యం.
* అణు విద్యుత్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు.
* మౌలిక రంగంలో సదుపాయాలకు కొత్త రేటింగ్ విధానం.
* ఇన్ ఫ్రా రంగంలో పన్ను రహిత బాండ్ల జారీ.
* భారత్ లో తయారు చేసే ఆహార ఉత్పత్తుల సంస్థలకు నూరు శాతం ఎఫ్డీఐకి అనుమతి.
* గ్రామీణాభివృద్ధికి గత సంవత్సరంతో పోలిస్తే 288 శాతం అధిక నిధులు.
* పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖగా మార్పు
* రుణ విధానం మరింత పారదర్శకం.
* ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ చట్టానికి త్వరలో సవరణ.
* సెబీ ద్వారా కొత్తగా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్.
* గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు మరిన్ని రాయితీలు.
* ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణకు కార్యాచరణ.
* స్టాక్ ఎక్స్ఛేంజీలు, బీమా, పింఛను రంగాల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు.
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించేలా చట్టాలకు సంస్కరణలు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Articles (Latest)
Articles (Education)