: పాతాళానికి స్టాండర్డ్ చార్టర్డ్... 84 శాతం దిగజారిన వార్షిక లాభం!

2015 సంవత్సరంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు లాభాలు పాతాళానికి జారిపోయాయి. వార్షిక లాభం 84 శాతం దిగజారింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో పాటు రుణాల వసూలు అనుకున్నంతగా జరగకపోవడంతో నష్టపోయామని బ్యాంకు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 2014లో 5.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 35 వేల కోట్లు) ఉన్న లాభం గత సంవత్సరం 800 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5,400 కోట్లు) పడిపోయింది. అంతకుముందు రాయ్ టర్స్ వార్తా సంస్థ నిర్వహించిన ఓ పోల్ లో, బ్యాంకు లాభాలు 899 మిలియన్ డాలర్ల వరకూ ఉండవచ్చని అనలిస్టులు అభిప్రాయపడ్డారు. బ్యాంకు ఫలితాలు అంచనాలకు దూరంగా ఉండటంతో, నేటి అమెరికా మార్కెట్ సెషన్ లో బ్యాంకు ఈక్విటీ పడిపోవచ్చని నిపుణుల అంచనా.

More Telugu News