: విమానం కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయంటే?

విమానం కిటికీలు గుండ్రంగా ఉండడం చూస్తూ ఉంటాం. బస్సులు, కార్లు, ఇతర వాహనాలకు చతురస్రాకారం లేదా, దీర్ఘచతురస్రాకారంలో ఉండే కిటికీలు విమానాల్లో మాత్రం ఎందుకు అలా ఉండవు? అనే ప్రశ్న పలువురిని వేధించే ఉంటుంది. 1950ల్లో జెట్ లైనర్ విమానాలు బాగా అందుబాటులోకి వచ్చాయి. ఇవి మిగిలిన సంప్రదాయ విమానాల కంటే వేగంగా వెళ్లగలిగేవి. అయితే, వీటికి చతురస్రాకార కిటికీలు ఉండేవి. 1953లో ఓ జెట్ లైనర్ విమానం కూలిపోయింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. విమానం కిటికీ చతురస్రాకారంగా ఉండడంతో, బలహీనమైన కోణంపై ఒత్తిడి పెరిగి, ఒక మూల నుంచి గాలి లోపలికి ప్రవేశించింది. దీంతో ఆ విమానం కుప్పకూలి, 56 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి గాలి దూరని విధంగా కిటికీలు డిజైన్ చేయాలని భావించి, గుండ్రంగా తయారు చేయడం మొదలుపెట్టారు. గుండ్రంగా ఉండడం వల్ల అక్కడ గాలి ఒత్తిడి పెరిగినా అది ఒక స్థానం వద్ద కేంద్రీకృతం కాకుండా ఉంటుంది. దీంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండదు. దీంతో అప్పటి నుంచి ప్రతి విమానానికి కిటికీలు గుండ్రంగా ఉండేలా రూపొందిస్తున్నారు.

More Telugu News