: ఐఫోన్ యూజర్లకు క్షమాపణలు చెప్పిన యాపిల్

ఐఫోన్ యూజర్లకు యాపిల్ క్షమాపణలు చెప్పింది. ఐఫోన్, ఐపాడ్ లలో హోమ్ పేజ్ బటన్ ను తరచూ వినియోగించడం వల్ల అది డామేజ్ అవుతోంది. దీంతో చాలామంది తమకు దగ్గరలో వున్న టెక్నీషియన్ తో దీనిని సరిచేయించుకుంటున్నారు. అనంతరం దానిని ఆపరేట్ చేస్తే 'ఎర్రర్ 53' మెసేజ్ కనిపిస్తోంది. దీంతో టెక్నీషియన్లు, వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై యాపిల్ సంస్థ వివరణ ఇచ్చింది. హోమ్ బటన్ లోనే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ రీడర్ ను నిక్షిప్తం చేశామని, వినియోగదారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఇప్పుడు సమస్యను పరిష్కరించామని, ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే యాపిల్ సపోర్ట్ స్టోర్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపింది.

More Telugu News