: ఆయనది రాతి గుండె...4 గంటల్లో 23 సార్లు గుండెపోటు...అయినా బతికాడు!

సాధారణంగా కర్కశంగా ప్రవర్తించే వాళ్లను రాతిగుండె కలవారిగా అభివర్ణిస్తాము...కానీ ఆయన గుండె రాతి గుండె కంటే గట్టిది. ఎందుకంటే, నాలుగు గంటల్లో 23 సార్లు గుండెపోటు వచ్చినా తట్టుకుని నిలబడింది. కేరళలోని కొచ్చిన్ లో 60 ఏళ్ల వయసున్న ఓ పెద్దమనిషి తన మనవడితో ఆడుకుంటుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ తీయగా ఆయనకు గుండెపోటు వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతనికి చికిత్స చేసేందుకు వారు ప్రయత్నించగా అందుకు ఆయన శరీరం సహకరించలేదు సరికదా, పదేపదే గుండె ఆగిపోసాగింది. దీంతో ఆయనను ఆస్టర్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు రాగానే తొలి గంటలో అందాల్సిన వైద్యం అందలేదని పేర్కొన్నారు. అందువల్లే 23 సార్లు ఆయన గుండె ఆగిందని వారు తెలిపారు. ఇప్పుడు స్టెంట్ వేశామని ఆయన క్షేమంగానే ఉన్నారని వారు వెల్లడించారు. అయితే అది కేవలం 30 శాతం రక్తాన్ని మాత్రమే పంపింగ్ చేస్తోందని వారు తెలిపారు.

More Telugu News