: అనాథకు 'దిక్కు' చూపిన హీరో!

పాకిస్థాన్ కు చెందిన నటుడు ఎహసాన్ ఖాన్ రోడ్డుపై తనకు ఎదురుగా వస్తున్న వ్యక్తిని యాచకుడుగా భావించి డబ్బులివ్వబోయాడు. దానిని అతను సున్నితంగా తిరస్కరించి, ఇంగ్లండ్ యాసలో తానేదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇవ్వగలిగితే ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దానికి ముచ్చటపడ్డ ఎహసాన్ ఖాన్ అతనిని ఇంటర్వ్యూ చేశాడు. బ్రిటన్ ఇంగ్లిష్ యాసలో ఆయన టకటకా సమాధానం చెప్పాడు. కారు ప్రమాదంలో భార్య సహా ఏడుగురు పిల్లలను పోగొట్టుకున్న ఆ వృద్ధుడ్ని అతని సోదరులు మోసం చేసి ఇంటి నుంచి గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో కరాచీ చేరుకున్నానని, కంప్యూటర్ పని తప్ప ఏ పని అయినా చిటికెలో చేస్తానని, అవకాశం ఇవ్వమని ఆయన తెలిపాడు. దీనిని ఎహసాన్ ఖాన్ తన సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, అది వైరల్ అయ్యింది. చాలా మంది అతనికి ఉద్యోగం ఇస్తామంటూ ముందుకొచ్చారు. పాక్ లో పేరు మోసిన ఆమ్ టెక్ సిస్టమ్స్ అనే కంపెనీ ఆయనకు ఓ క్వార్టర్ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ వీడియో ఓ వ్యక్తికి జీవితం చూపిస్తే...ఎహసాన్ ఖాన్ ను రియల్ హీరోను చేసింది.

More Telugu News