: ఐఐటీ టెక్కీలకు ఈ ఏడాది కనీసం లక్ష!

ఈ సంవత్సరం ఐఐటీలలో టెక్నాలజీ విద్యను అభ్యసించి, క్యాంపస్ సెలక్షన్లలో విజయం సాధించిన వారికి గత సంవత్సరం వేతన ఆఫర్ తో పోలిస్తే 10 నుంచి 20 శాతం వరకూ అధికంగా లభిస్తోంది. హైదరాబాద్, గాంధీనగర్, ఇండోర్, రోపార్, మండి తదితర ప్రాంతాల్లో సాలీనా రూ. 12 లక్షల వేతనంతో ఆఫర్లు అందనున్నాయని ఐఐటీ హైదరాబాద్ ఫాకల్టీ ఇన్ చార్జ్ బీ వెంకటేశం అభిప్రాయపడ్డారు. గ్రాడ్యుయేట్ స్థాయిలో పాత, కొత్త ఐఐటీల నుంచి వచ్చే వారికి ప్రారంభం ఆఫర్ లో తేడాలేమీ ఉండబోవని, సరాసరి వేతనం లక్ష రూపాయలకు అటూ ఇటుగా ఉండవచ్చని అంచనా వేశారు. కాగా, హైదరాబాద్ ఐఐటీలో ఈ నెల 1 నుంచి ప్లేస్ మెంట్లు ప్రారంభం కాగా, 400 మంది విద్యార్థుల్లో 44 శాతం మందికి ఆఫర్ లెటర్లు చేతికందాయి. మండీ ఐఐటీలో 65 శాతం, రోపార్ ఐఐటీలో 70 శాతం మందికి ఆఫర్లు లభించాయని తెలుస్తోంది. గత సంవత్సరం సరాసరి వేతనం సాలీనా రూ. 9 లక్షలుగా ఉండగా, ఈ సంవత్సరం అది రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెరిగిందని మండీ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సమార్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.

More Telugu News