: చూస్తుండండి... అన్ని బుల్ మార్కెట్లనూ తలదన్నుతాం: రాకేశ్ ఝున్ ఝున్ వాలా

భారత స్టాక్ మార్కెట్ సమీప భవిష్యత్తులో గణనీయంగా లాభాలను ఆర్జించనుందని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా అభిప్రాయపడ్డారు. మన మార్కెట్లు ప్రస్తుతమున్న స్థితికన్నా కిందకు జారిపోయే పరిస్థితి లేదని, శరవేగంగా ముందుకు దూకడాన్ని చూడనున్నామని వివరించారు. "అన్ని వర్ధమాన దేశాల కన్నా బలమైన బుల్ మార్కెట్ మన ముందుకు రానుంది. 2016లో అద్భుత రిటర్న్ లను అందించనుంది. కమోడిటీ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటం మార్కెట్ల వృద్ధికి దోహదపడనుంది" అని అన్నారు. పన్ను చెల్లింపుల అనంతరం సాలీనా 15 శాతం రాబడిని ఇచ్చేందుకు దేశవాళీ కంపెనీల ఈక్విటీలు సిద్ధంగా ఉన్నాయి. మీడియం నుంచి లాంగ్ టర్మ్ రేంజ్ లో లార్జ్ కాప్ కంపెనీలు మరింత శాతం లాభాలను అందిస్తాయని చెప్పగలనని ముంబై మార్కెట్లో వారన్ బఫెట్ అంతటి ఇన్వెస్టర్ గా చెప్పుకునే రాకేశ్ ఝున్ ఝున్ వాలా తెలిపారు.

More Telugu News