: ఢిల్లీపై వైమానిక దాడులు జరిగే అవకాశం: హోం శాఖ హెచ్చరిక

దేశ రాజధాని ఢిల్లీపై ఉగ్రవాదులు వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. నగరంలోని 15 ప్రాంతాలు ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నాయని, భద్రతా ఏజన్సీల నివేదికలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థల నుంచి ఢిల్లీకి ముప్పు పొంచి ఉందని చెప్పింది. డ్రోన్లతో దాడి జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉగ్రవాదుల లక్ష్యాల్లో రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి నివాసం, ప్రధాని నివాసం, కేంద్ర హోం మంత్రి నివాసం, రాజ్ పథ్, ఇండియా గేట్, సీజీఓ కాంప్లెక్స్, సీబీఐ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ కార్యాలయాలు కూడా ఉన్నాయని తెలిపింది.

More Telugu News