: విదేశీయులు దూరం కావడంతో లాభాల నుంచి నష్టాల్లోకి!

సెషన్ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచికలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారాయి. ఒక దశలో దేశవాళీ ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీలను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు కనిపించినా, ఆసియా మార్కెట్ల సరళి కొనుగోలు సెంటిమెంటు నిలపడంతో, ఈక్విటీల విక్రయాలు ఆగిపోయాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 108.85 పాయింట్లు పడిపోయి 0.40 శాతం లాభంతో 27,361.96 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 34.90 పాయింట్లు పెరిగి 0.42 శాతం లాభంతో 8,260.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.52 శాతం, స్మాల్ క్యాప్ 0.72 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో బీహెచ్ఈఎల్, బజాజ్ ఆటో, వీఈడీఎల్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు లాభపడగా, ఆసియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 99,93,729 కోట్లుగా ఉంది. మొత్తం 2,869 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 978 కంపెనీలు లాభాలను, 1,735 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News