: ప్లీజ్ హెల్ప్... ఫ్లిప్ కార్ట్ ను కోరిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో నుంచి దొంగిలించబడి, ఆపై రికవరీ అయిన రూ. 40 లక్షల విలువైన 209 ఫోన్లను ఆన్ లైన్ మాధ్యమంగా విక్రయించిన కేసులో తమ విచారణకు సహకరించాలని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ను ఢిల్లీ పోలీసులు సంప్రదించారు. వీటిని ఆరుగురు వ్యక్తులు ఐజీఐ ఎయిర్ పోర్టు సరకు రవాణా కేంద్రం నుంచి ఆరుగురు వ్యక్తులు దొంగిలించారు. వీటిల్లో 22 ఫోన్లను మైసూర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, ఢిల్లీ, చండీగఢ్ ప్రాంతాల నుంచి రికవరీ చేశామని తెలిపారు. హాంకాంగ్ నుంచి వచ్చిన పార్సిళ్లలో 600కు పైగా హైఎండ్ మొబైల్ ఫోన్లు దొంగిలించబడ్డాయని ఢిల్లీకి చెందిన ఒక లాజిస్టిక్స్ సంస్థ జూలైలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసును విచారించారు. ఈ కేసులో కార్గో ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని వివరించారు. ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోకుండా ఎలా విక్రయించారంటూ ఫ్లిప్ కార్ట్ కు నోటీసులు పంపినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇవి రాజస్థాన్ కేంద్రంగా ఉన్న ఓ ఏజంటు ద్వారా అమ్మకాలు జరిగాయని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి తెలిపారు.

More Telugu News