: కంగ్రాట్స్ కన్నా...థ్యాంక్స్ నాన్నా: నాగార్జున, అఖిల్ సంభాషణ

అక్కినేని సినీ నట వారసుడు అఖిల్ కొత్త సినిమా పోస్టర్లు సిద్ధమయ్యాయి. ప్రముఖ నటుడు నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'అఖిల్' అనే టైటిల్ నిర్ణయించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్ లో అఖిల్ ఫోటో మాత్రమే కనిపించడం విశేషం. ఈ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా అఖిల్ తండ్రి ప్రముఖ నటుడు నాగార్జున విడుదల చేశాడు. ఈ సందర్భంగా 'కంగ్రాట్స్ కన్నా...ఐ లవ్ యువర్ పోస్టర్స్' అని నాగార్జున ప్రశంసించాడు. దానికి ప్రతిగా 'థ్యాంక్స్ నాన్నా' అంటూ అఖిల్ సమాధానమిచ్చాడు. మరో నటుడు సచిన్ జోషి కూడా అఖిల్ ను అభినందించాడు.

More Telugu News