: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మధ్య తరగతి ప్రజలకు మరింత ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిన్న నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.2.70, డీజిల్ పై రూ.3.97 చొప్పున ధరలను తగ్గించాయి. తగ్గించిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇంధన ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో ప్రతి 15 రోజులకోమారు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో చమురు రంగ సంస్థలు కూడా ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ దఫా ధరల తగ్గింపులో గ్యాస్ సిలిండర్ల రేటు కూడా ఉంది. అయితే ఇది నాన్ సబ్సీడీ వినియోగదారులకు మాత్రమే పరిమితమైంది. ఒక్కో సిలిండర్ పై రూ.23.50 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

More Telugu News