: అత్యాధునిక చైనా రాకెట్ పరీక్ష విజయవంతం

ఐదో తరానికి చెందిన అత్యాధునిక రాకెట్ ప్రయోగం విజయవంతమైందని చైనా తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాహకనౌక కంటే ఇది రెండు రెట్లు అధిక పేలోడ్ ను మోసుకెళ్లగలదు. వచ్చే సంవత్సరం దీనిని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నట్టు చైనా తెలిపింది. లాంగ్ మార్చ్ సిరీస్ లో భాగంగా ఐదో తరం లాంగ్ మార్క్-5 లాంఛింగ్ వెహికల్ గా ఈ రాకెట్ ను రూపొందించారు. తక్కువ ఎత్తులో గల భూకక్ష్య వరకు 25 టన్నుల బరువును, భూ స్థిర కక్ష్యకు 14 టన్నుల బరువును ఈ రాకెట్ మోసుకెళ్లగలదని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రాకెట్ల కంటే రెండు రెట్లు పేలోడ్ అధికంగా బరువును మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకత అని చైనా రక్షణ శాఖ తెలిపింది.

More Telugu News