: అదో సిల్లీ ఇష్యూ...ప్రధాని స్పందించక్కర్లేదు: 'వ్యాపం'పై సదానంద గౌడ

మధ్యప్రదేశ్ ను కుదిపేస్తున్న వ్యాపం స్కాం ను కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సిల్లీ ఇష్యూగా కొట్టిపారేశారు. వ్యాపం స్కాంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఉదయ్ పూర్ లో మాట్లాడుతూ, దీనిపై ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాపం స్కాంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సంబంధిత శాఖల మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించిన నేపథ్యంలో ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను దెబ్బతీసే అంశమైతే ప్రధాని స్పందిస్తారని, ప్రతి చిన్న విషయానికి ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ స్కాంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారు, సాక్షులు వరుసగా 48 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

More Telugu News