: ఆడాళ్లు గట్టిపిండాలే...మగాళ్లే అల్పాయుష్కులు!

కుటుంబం, బయటి బాధ్యతలతో సతమతమయ్యే మగాళ్ల ఆయుష్షు ఆడవాళ్లతో పోలిస్తే తక్కువేనని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఈ విషయంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. స్త్రీల కంటే పురుషుల ఆయుష్షు బాగా తక్కువని వారు తెలిపారు. ఈ పరిస్థితి ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషులకు ఆయుష్షు తక్కువేనని వారు స్పష్టం చేశారు. ఎక్కువ మంది మగాళ్లు గుండెపోటుతో గుటుక్కుమంటున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. 19వ శతాబ్దం తొలి రోజుల వరకు పురుషుల ఆయుఃప్రమాణం కూడా మహిళలకు దీటుగా ఉండేదని, కాల క్రమంలో 20 శతాబ్దం వచ్చే సరికి ఇది తగ్గిపోయిందని వారు పేర్కొన్నారు. మగాళ్ల ఆయుష్షు తగ్గుతున్నప్పటికీ స్త్రీల ఆయుష్షు అలాగే ఉందని వారు వెల్లడించారు. 13 అభివృద్ధి చెందిన దేశాల్లోని స్త్రీ, పురుషులపై పరిశోధనలు నిర్వహించగా ఈ విషయాలు తెలిశాయని పరిశోధకులు తెలిపారు. పొగతాగడం, మద్యం తీసుకోవడం పురుషుల ఆయుఃప్రమాణంపై ప్రభావం చూపుతున్నాయని వారు స్పష్టం చేశారు.

More Telugu News