: ఆర్థికవేత్తల కంటే జ్యోతిష్యులు నయం... కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విసుర్లు

గ్రీస్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో జరిగిన రెఫరెండం తర్వాత భారత కేపిటల్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందన్న ఆర్థికవేత్తల వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. అసంబద్ధంగా ఉన్న ఆర్థికవేత్తల అంచనాలను చూస్తోంటే, జ్యోతిష్యులు చెప్పే విషయాలపై విశ్వసనీయత కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా నిన్న జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో భారత మార్కెట్ల పతనం తప్పదని ఆర్థికవేత్తలు అంచనాలేస్తే, మార్కెట్లు మాత్రం అందుకు విరుద్ధంగా లాభాలతో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

More Telugu News