: సహారా ఎడారిలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉండేదట!

ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా. ఇందులో ప్రపంచంలోనే అతి పెద్దదైన మంచినీటి సరస్సు ఉండేదట. దాదాపు 15 వేల సంవత్సరాల క్రితం ఇప్పటి సహారా ఎడారి ప్రాంతంలో ఈ మంచి నీటి సరస్సు ఉండేదని పరిశోధనలో తేలింది. సుమారు 3,60,000 కిలో మీటర్ల మేర ఈ సరస్సు వ్యాపించి ఉండేదని పరిశోధకులు తెలిపారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దీని పేరు 'పలావోలేక్ మెగా ఛాద్' అని, 'బొడెలే డిప్రెషన్' కారణంగా ఈ సరస్సు ఎండిపోయిందని వారు వెల్లడించారు. సహారా ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ధూళి కారణంగా దీని పరిమాణం తగ్గిపోయి 355 చదరపు కిలోమీటర్లకు పరిమితమైందని వారు తెలిపారు.

More Telugu News