: అంగారకుడి దగ్గరకు ఫుట్ బాల్ సైజ్ ఉపగ్రహాలు

అంగారకుడిపై మానవ జీవనానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు సంబంధించిన పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం నాసా వచ్చే ఏడాది ఓ ల్యాండర్‌ ను పంపనుంది. దీంతో పాటు రెండు బుల్లి ఉపగ్రహాలైన ‘క్యూబ్‌శాట్స్’ను కూడా పంపనున్నట్లు నాసా తెలిపింది. ఫుట్‌ బాల్ సైజ్ బంతుల్లా చిన్నగా ఉండే ఈ క్యూబ్‌శాట్స్ ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తాయి. వీటిని పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు తయారు చేసి నాసాకు పంపారు. అలా పంపిన క్యూబ్ శాట్స్ ను నాసా భూ ఉపరితల కక్ష్యలోకి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అవి విజయవంతం కావడంతో, వీటితో ప్రయోజనాలు ఉంటాయని భావించిన నాసా, భారీ ఉపగ్రహంతో పాటు చిన్న ఉపగ్రహాలను కూడా అంగారకుడిపైకి పంపనుంది. వీటిని ల్యాండర్‌ తో పాటు మార్స్ పైకి పంపడం విజయవంతం అయితే, సమగ్రమైన సమాచారం భూమికి చేరవేసేందుకు క్యూబ్ శాట్స్ ఉపయోగపడతాయని నాసా భావిస్తోంది.

More Telugu News