ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కుక్కకు ఖరీదైన గిఫ్టులు

Wed, May 27, 2015, 07:28 PM
Related Image పిల్లలకి తల్లిదండ్రులు రకరకాల వస్తువుల్ని కానుకలుగా ఇస్తుంటారు. అయితే, చైనాలో అత్యంత ధనవంతుడైన వాంగ్ జియాన్ లిన్ తన కుమారుడు వాంగ్ సికాంగ్ కు ఓ కుక్కను బహుమతిగా ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన బహుమతికి మురిసిపోయిన సికాంగ్, ఆ కుక్కకు రెండు యాపిల్ వాచ్ లు గిఫ్టుగా కొన్నాడు. ఒక్కో వాచ్ ధర 1099 అమెరికన్ డాలర్లు కావడం విశేషం.

కుక్క ముందరి కాళ్లకు ఆ వాచ్ లు తగిలించి, ఫోటోలు తీసి వైబోలో పోస్టు చేశాడు. అంతే కాదు, చైనీస్ ట్విట్టర్ గా పేరొందిన వైబోలో దాని పేరుమీద ఓ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ పేజ్ లో కుక్క విశేషాలు, కుక్క కబుర్లు పెడుతుంటాడు. కుక్క మాట్లాడుతున్నట్టు ముచ్చట్లు కూడా పెడతాడు. కుక్కకు ఫాలోవర్లు కూడా ఉండడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Articles (Latest)
Articles (Education)