: ఈ జపాన్ రైలుకు సాటేదీ?

వేగవంతమైన రైళ్లకు పుట్టినిల్లుగా జపాన్ పేరుగాంచింది. తాజాగా, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అనదగ్గ టెక్నాలజీ, డిజైనింగ్ తో తయారైన మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) ట్రైన్ ప్రపంచ రికార్డు స్పీడ్ నమోదు చేసింది. ఏడు బోగీలున్న మాగ్లెవ్ రైలు గంటకు 603 కిలోమీటర్ల వేగంతో పయనించి రికార్డు నెలకొల్పింది. 2003లో మాగ్లెవ్ రైలు 581 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా అప్పట్లో అది రికార్డు. వారం కిందట ఆ రికార్డును తిరగరాస్తూ 590 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. మౌంట్ ఫుజి వద్ద మంగళవారం నిర్వహించిన పరీక్ష సందర్భంగా ఇప్పుడా రికార్డు కూడా బద్దలైంది. మాగ్లెవ్ రైలు ప్రత్యేకమైన టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఈ రైలుకు చక్రాలుండవు. పట్టాలకు రైలుకు మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉంటుంది. 'అయస్కాంత సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి' అన్న సూత్రంపై ఆధారపడి ఈ రైలు పట్టాలకు ఎడంగా ఉన్నా స్థిరంగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకమైన పట్టాలు వినియోగిస్తారు. ఈ పట్టాల్లో విద్యుదావేశభరితమైన అయస్కాంతాలుంటాయి.

More Telugu News