ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్ అంటే ఇంగ్లండ్ డ్రైవర్ డేవిడ్ లాంగ్ దే... రెండు సార్లు దక్కిన యూరో లాటరీ!

Thu, Apr 02, 2015, 07:46 AM
Related Image అదృష్టలక్ష్మి వరిస్తుందని లాటరీ టికెట్ కొనడం, ఆ తర్వాత డీలా పడటం చాలా మందికి అలవాటే. ఇంగ్లండ్ లో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న డేవిడ్ లాంగ్ కూడా అందుకేమీ భిన్నం కాదు. లాటరీ టికెట్లు కొనడం, వాటిని చెత్తకుండీల్లో పడేయటం అతడికి మామూలే. అయితే ఓ సారి భార్య క్యాథలీన్ తో కలిసి పడేసిన లాటరీ టికెట్ ను చెత్తకుండీ వద్దకెళ్లి మరీ వెతుక్కుని చూస్తే, అతడి పంట పండింది. తన టికెట్ కు యూరో లాటరీలో రూ.10 కోట్లు వచ్చాయి.

2013లో ఈ ఘటన జరిగితే, తన పాత అలవాటుకు ఏమాత్రం చెల్లుచీటి ఇవ్వని లాంగ్ ఆ తర్వాత కూడా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. తాజాగా గత శుక్రవారం లాంగ్ దంపతులకు మరోమారు యూరో లాటరీ తగిలింది. ఈ సారి కూడా రూ.10 కోట్ల విలువ చేసే లాటరీ వారి సొంతమైంది. సుదీర్ఘకాలంగా డ్రైవర్ గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన లాంగ్, తనకు దక్కిన లాటరీ సొమ్ముతో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుక్కుని, అందులో దర్జాగా బతకాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Articles (Latest)
Articles (Education)