: వైకాపాకు పట్టున్న ఊర్లో... పవన్ కు బ్రహ్మరథం

గుంటూరు జిల్లా బేతపూడి గ్రామం. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఊరి రైతులంతా భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క ఎకరం కూడా ఇవ్వమని ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పేశారు. మరో విషయం ఏమిటంటే, ఈ గ్రామంలో అధిక శాతం వైఎస్సార్సీపీ అభిమానులే. కానీ, వైకాపాకు అత్యంత పట్టున్న ఈ గ్రామ రైతులు ఈ రోజు జనసేన అధినేత పవన్ కు బ్రహ్మరథం పట్టారు. సభా వేదికపై రైతులతో పాటు పవన్ కూడా కిందే కూర్చున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. బలవంతంగా భూసేకరణ చేస్తే రైతుల తరపున పోరాటం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎండ వేడి కారణంగా పవన్ కు చెమటలు పట్టాయి. దీంతో, పక్కనే ఉన్న ఓ రైతు పవన్ కు తన టవల్ ఇచ్చారు. ఆ టవల్ తో పవన్ తన ముఖాన్ని తుడుచుకున్నారు. మరో మహిళ తాను తెచ్చిన బాక్స్ నుంచి కొంత ఫలహారాన్ని పవన్ కు తినిపించింది. మరో పెద్ద వయసు మహిళ పవన్ ను ఆప్యాయంగా ముద్దాడింది. ఈ రకంగా, వైకాపాకు పట్టున్న గ్రామ రైతుల మనసులను పవన్ దోచేసుకున్నారు.

More Telugu News