: ‘లోటు’ ముంగిట ‘మిగులు’ రాష్ట్రం... తలకిందులైన తెలంగాణ అంచనాలు!

రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తేలిన తెలంగాణ ఏడాది గడవకుండానే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పన కసరత్తుకు దిగిన రాష్ట్ర ప్రభుత్వం, కళ్లెదురుగానే కరిగిపోతున్న ఆదాయాన్ని చూసి బెంబేలెత్తిపోతోంది. 2014-15లో రెవెన్యూ మిగులుతో బడ్జెట్ ను అట్టహాసంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ సర్కారు, ఈ దఫా రెవెన్యూ లోటుతో బడ్జెట్ ను ప్రవేశపెట్టక తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. విశ్లేషణలను పక్కనబెడితే, సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈ విషయంపై నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారట. మిగులు రాష్ట్రమని గొప్పలు చెప్పుకున్న తమకు అప్పులు పుట్టే మార్గం లేకపోగా, కేంద్రం నుంచి సాయం కూడా రాదని ఆయన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఈ విపత్కర పరిస్థితిపై నిన్నటి భేటీలో గవర్నర్ ముందు ఆయన తమ దురవస్థపై ఏకరువు పెట్టారట. ఇప్పటిదాకా ముగిసిన కసరత్తులో భాగంగా ఆదాయంలో రూ.11 వేల కోట్లకు గండిపడిందట. ఇక మార్చిలో భారీ లోటు తప్పదని అధికారులు అంచనాలేస్తున్నారు.

More Telugu News