: అమెరికాలో జంతువుల కోసం ప్రత్యేక ఎయిర్ పోర్టు!

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జంతువుల కోసం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ పోర్ట్ లోని కార్గో టెర్మినల్ పక్కనే వున్న 14.4 ఎకరాల స్థలంలో 48 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో జంతువుల కోసం టెర్మినల్‌ ను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లులు, కుక్కలు, కోళ్లు, కొంగలు, పక్షులు, పశువులు తదితర పెంపుడు జతువులకు, వన్య మృగాల రవాణా కోసం దీన్ని వాడనున్నారు. ఈ టెర్మినల్‌ కు 'ది ఆర్క్' అని పేరు పెట్టారు. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ టెర్మినల్ నిర్మాణానికి రేస్‌ బ్రూక్ కేపిటల్ సంస్థకు అనుబంధమైన ఏఆర్‌కేకు అనుమతులిస్తూ, యూఎస్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 1.78 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌ లో జంతువుల మేతకు, వాటి విశ్రాంతికి అవసరమైన వేర్వేరు గదులుంటాయి. వాటి పర్యవేక్షణకు పశువుల డాక్టర్ల కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

More Telugu News