Renuka Chowdhary: కులగణనపై కేంద్రాన్ని నిలదీసిన రేణుకా చౌదరి

Renuka Chowghary slams Centre on caste based census

  • కులగణనపై రాహుల్ గాంధీ కీలక ప్రతిపాదన చేశారన్న రేణుకా చౌదరి
  • మోదీ సర్కారు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోందంటూ ఆగ్రహం
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన జరిపి తీరతామని స్పష్టీకరణ

దేశంలో కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ కీలక ప్రతిపాదన చేశారని, కులగణన ఎందుకు చేపట్టాలన్న దానిపై ఆయన సమగ్ర వివరణ కూడా ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మహిళా నేత రేణుకా చౌదరి అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోందని మండిపడ్డారు. 

రేణుకా చౌదరి నేడు  ఢిల్లీలో మాట్లాడుతూ, కులగణన ఎందుకు చేపట్టడంలేదో మోదీ సర్కారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టకుండా మిమ్మల్ని నిరోధిస్తున్న అంశాలు ఏవి? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి తీరుతామని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.

Renuka Chowdhary
Caste Census
Rahul Gandhi
Congress
Narendra Modi
NDA
  • Loading...

More Telugu News