Telangana: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట

Big relief to TG government in HC

  • విద్యుత్ కొనుగోళ్ల బిడ్‌కు తెలంగాణకు అనుమతి నిరాకరణ
  • హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • బిడ్డింగ్‌కు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్‌డీసీ)ను ఆదేశించింది.

విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రూ.261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా ఎన్ఎల్‌డీసీ అడ్డుకుంది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం... ఎన్ఎల్‌డీసీ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని బిడ్డింగ్‌కు అనుమతించాలని ఆదేశించింది.

Telangana
TS High Court
Congress
  • Loading...

More Telugu News