Petrol: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం... కేంద్రం సంకేతాలు!

Petrol diesel prices may fall if crude oil rates remain low
  • అంతర్జాతీయ మార్కెట్లో మూడేళ్ల కనిష్ఠానికి చమురు ధరలు
  • ఇదే స్థాయిలో ఉంటే మన వద్ద ధరలు తగ్గే అవకాశముందంటున్న నిపుణులు
  • తక్కువ ధరకు వస్తుండటంతో రష్యా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపిన జైన్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం క్రూడాయిల్ బ్యారెల్ ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంకజ్ జైన్ కూడా వెల్లడించారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు ఇదేస్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో మూడేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర రెండు రోజుల క్రితం 70 డాలర్ల దిగువకు చేరింది.

రష్యా నుంచి తక్కువ ధరకు చమురు వస్తోందని, కాబట్టి అక్కటి నుంచి వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకోవాలని భారత్ భావిస్తోందని పంకజ్ జైన్ వెల్లడించారు.
Petrol
Diesel
Central Government

More Telugu News