Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారికందరికీ ఆయుష్మాన్ భారత్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర క్యాబినెట్

Union cabinet takes key decision on Ayushman Bharat scheme
  • ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం
  • ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స   
  • 6 కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనకరం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 70 ఏళ్లు, ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. 

ఆయుష్మాన్ భారత్ ద్వారా 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. 

రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకువచ్చారు. పీఎం ఈ-డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా 88,500 చార్జింగ్ స్టేషన్లకు తోడ్పాటు లభించనుంది. 

ఇక, జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.12,461 కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 31,350 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Ayushman Bharat
Senior Citizens
Union Cabinet
Narendra Modi
NDA

More Telugu News