Viral Video: ఫుల్లుగా మందుకొట్టి విమానం ఎక్కిన యువతి.. జార్జియా అనుకుని ఇండియాకు!

Drunk Woman Mistakenly Books And Boards Flight For India Instead Of Georgia

  • తాగిన మత్తులో జార్జియాకు బదులు ఇండియా వెళ్లే విమానం టికెట్లు కొనుగోలు చేసిన యువతి
  • పైలట్ హిందీలో మాట్లాడడంతో ఉలికిపాటు
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న యూజర్లు
  • ఎలాగూ ఇండియా వస్తున్నారు కాబట్టి ఇక్కడి సందర్శనీయ స్థలాలు చూడాలని సూచన
  • ఆమె కంటే బోర్డింగ్ పాస్ చెక్ చేసిన వారే ఎక్కువ తాగి ఉంటారన్న నెటిజన్లు

మద్యం ఒకసారి పొట్టలోకి వెళ్లాక దాని చేష్టలు వింతగా ఉంటాయి. కొందరితో విపరీతంగా మాట్లాడిస్తే, కొందరిని మౌనమునులుగా మార్చేస్తుంది. కొందరితో పిచ్చిచేష్టలు చేయిస్తుంది. నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. అయితే, మందుకొట్టిన ఈ అమ్మాయి మాత్రం తనను తాను మర్చిపోయింది. తాను వెళ్లాల్సింది ఒక దేశమైతే.. ఇంకో దేశానికి టికెట్ కొనుగోలు చేసి విమానం ఎక్కేసింది. 

విమానంలో మగతగా కూర్చున్న ఆమె.. పైలట్ హిందీలో మాట్లాడుతూ ప్రయాణికులకు సూచనలు చెప్పగానే ఉలిక్కిపడింది. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ‘మీరు తాగిన మత్తులో జార్జియాకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. మీరిప్పుడు విమానంలో కూర్చున్నారు. మీకు తెలుసా? నిజానికి ఈ విమానం ఇండియా వెళ్తోందని’ అని ఆ వీడియోపై రాసుకొచ్చారు. ఈ వీడియోను 3 లక్షల మందికిపైగా వీక్షించారు. 

ఈ వీడియోను చూసిన కొందరు.. తాగినా కూడా విమానం ఎక్కిసారా? అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఎలాగూ ఇండియా వస్తున్నారు కాబ్టటి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయని, వాటిని చూసి వెళ్లాలని సూచించారు. కొందరు మాత్రం ఈ మహిళ కంటే బోర్డింగ్ పాస్ చేసిన వ్యక్తే ఎక్కువగా తాగి ఉంటారని, అందుకే ఈ పొరపాటు జరిగి ఉందని చెప్తున్నారు.

View this post on Instagram

A post shared by NINI ★ (@stellaniniii)

Viral Video
Drunk Woman
Georgia
Flight
India
  • Loading...

More Telugu News