Central Government: ఏపీ, తెలంగాణలలో వరదలు... క్లెయిమ్స్ త్వరితగతిన సెటిల్ చేయాలని బీమా సంస్థలకు కేంద్రం ఆదేశం

Insurance companies directed to ensure swift claim settlements in flood hit AP and Telangana
  • బీమా కంపెనీలకు ఆర్థికమంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశం
  • ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం ద్వారా త్వరితగతిన క్లెయిమ్స్ సెటిల్ చేయాలని సూచన
  • నోడల్ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు అందరికీ వెల్లడించాలని సూచన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో త్వరితగతిన క్లెయిమ్స్ సెటిల్మెంట్లు జరిగేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఈరోజు బీమా కంపెనీలకు సూచించింది. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వరంగ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. 

ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్లు త్వరగా పూర్తి చేయాలని బీమా కంపెనీలకు సూచించింది. తద్వారా వరద ప్రభావిత బాధితులకు ఉపశమనం అందించాలని పేర్కొంది.

అలాగే, పాలసీదారులు సంప్రదించాల్సిన నోడల్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నంబర్‌లను అందరికీ తెలియజేయాలని పేర్కొంది. ఈ విపత్తులో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి, వారికి అవసరమైన సహాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని తెలిపింది. 

భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఈ వరదలతో లక్షలాదిమంది ప్రభావితమయ్యారు.
Central Government
LIC
Insurance
Andhra Pradesh
Telangana

More Telugu News