Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీ ప్రకటన.. డిస్కౌంట్లు వివరాలు ఇవిగో

Flipkart Big Billion Days Sale on Flipkart will kick off on September 30 2024
  • మెగా సేల్‌లో అదిరిపోయే డీల్‌లు, ప్రత్యేక ఆఫర్‌లు అందించనున్న కంపెనీ
  • ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌’ సభ్యులకు ఒక రోజు ముందుగానే షురూ
  • పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటన
పండగ సీజన్‌లో వివిధ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూసే ఈ-కామర్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎట్టకేలకు బిగ్ బిలియన్ డేస్ సేల్-2024 తేదీ, వివరాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభమవుతుందని, అనేక రకాల ఉత్పత్తులపై ఈ ఏడాది భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అధికారిక వెబ్‌సైట్‌పై వెల్లడించింది. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌’ సభ్యులకు ఒక రోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 29 నుంచే ఈ సేల్‌ ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దసరా, దీపావళి పండుగలకు ముందు ఈ సేల్‌ జరగనుంది. గతేడాది అక్టోబర్ 8, 2023న జరిగగా.. ఈ సంవత్సరం కొంచెం ముందుగానే మొదలవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులతో పాటు ఇతర మరికొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ల కోసం కస్టమర్లు ఎదురుచూస్తుంటారు. అంచనాలకు తగ్గట్టే ఈ ఏడాది భారీ ఆఫర్లు ఇవ్వబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

స్మార్ట్ టీవీలపై 80 శాతం వరకు, ఎంపిక చేసిన వస్తువులతో పాటు ఫ్రిజ్‌లు, 4కే స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఈ-కామర్స్ దిగ్గజం పేర్కొంది. ఇక స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే నథింగ్, రియల్‌మీ,  ఇన్‌ఫినిక్స్‌తో పాటు మరిన్ని ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయని కంపెనీ పేర్కొంది.

ఇక ప్రత్యేకమైన ఆఫర్లుగా కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్లకు కూడా ఎంపిక చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్, కూపన్ డిస్కౌంట్‌ల ప్రయోజనాలు దక్కనున్నాయి.
Flipkart
Flipkart Big Billion Days
Online Sales
E-Commerce sales

More Telugu News