pushpa 2: పుష్ప-2 ఓటీటీ హక్కుల కోసం కళ్లు చెదిరే ధర!

pushpa 2 digital rights bagged by netflix for 275 crores and 1000 crores business

  • రిలీజ్ కు ముందే భారీగా పుప్ప 2 మూవీ బిజినెస్
  • రికార్డు ధర పెట్టి హక్కులు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్  
  • మ్యూజిక్ హక్కులు కొనుగోలు చేసిన టీ సిరీస్ సంస్థ

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప 2' మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ కనబడుతోంది. టాప్ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పటి వరకూ ఏ భారతీయ మూవీకి వెచ్చించనంత పెట్టి మరీ పుప్ప 2 హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 275 కోట్లకు ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక హిందీ వెర్షన్ హక్కులను అనిల్ తడాని రూ.200 కోట్లతో కొనుగోలు చేశారట. అది కూడా అడ్వాన్స్ బేసిస్ మీద. అంతే కాకుండా మ్యూజిక్ కూడా భారీ రేటు పలికింది. టీ సిరీస్ సంస్థ ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ హక్కుల కోసం రూ.60 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. ఇది కూడా ఒక రికార్డేనని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే, రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రూపంలో రూ.1000 కోట్ల బిజినెస్ జరిగిందనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకూ భారత సినీ చరిత్రలోనే ఈ బిజినెస్ అత్యధికమని అంటున్నారు.

pushpa 2
Movie News
Allu Arjun
  • Loading...

More Telugu News