Viral Videos: కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన బాలుడు... వీడియో ఇదిగో!

Two year old boy clings to kidnapper refuses to leave him 14 months after abduction

  • కిడ్నాప్ అయిన 14 నెలలకు తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
  • కిడ్నాపర్‌పై మమకారం పెంచుకున్న చిన్నారి
  • బలవంతంగా తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించిన పోలీసులు  

కిడ్నాపర్ చెర నుండి విడుదలైన ఓ బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా మారాం చేస్తూ ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ కు చెందిన సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ (రిజర్వ్ పోలీస్) తనూజ్ చాహర్ .. రాజస్థాన్ కు చెందిన పృధ్వీ అనే చంటిబిడ్డను నెలల ప్రాయంలోనే తల్లి నుండి దూరం చేసి ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్‌ఫోన్ వాడకుండా, ఎప్పటికప్పుడు వేషం మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో బిడ్డను తిప్పాడు. అయితే కిడ్నాప్ అయిన ఆ చంటిబిడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. 

దాదాపు 14 నెలల తర్వాత అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటీవలే తనూజ్ చాహర్‌ను అలీఘర్ లో అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే 14 నెలలుగా తనూజ్ చాహర్ వద్దే పెరగడంతో ఆ బాలుడు తల్లిదండ్రులను గుర్తించలేదు. దీంతో తనూజ్‌ను వదిలివెళ్లడానికి మారాం చేశాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి మారాం చేస్తున్నా పోలీసులు బలవంతంగా వారికి అప్పగించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. చిన్నారి తల్లి పూనమ్ చౌదరిని తనతో వచ్చేయాలని తనూజ్ ఒత్తిడి చేశాడని, ఆమె నిరాకరించడంతోనే బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది.

Viral Videos
Kidnapper
Kid
Mother
  • Loading...

More Telugu News