Zaheer Khan: ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్‌గా జ‌హీర్ ఖాన్

Zaheer Khan Leaves Mumbai Indians To Join Lucknow Super Giants As Mentor

  • 'ఎక్స్' వేదిక‌గా ఎల్‌ఎస్‌జీ అధికారిక ప్ర‌క‌ట‌న‌
  • గతంలో ముంబయి జట్టులో కోచింగ్ స్టాఫ్‌లో కనిపించిన జ‌హీర్ 
  • ఆ టీమ్ డైరెక్టర్‌గా, గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా సేవ‌లు
  • ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, ఎంఐ, డీసీ జ‌ట్ల‌కు మాజీ పేస‌ర్‌ ప్రాతినిధ్యం

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా టీమిండియా మాజీ పేసర్ జ‌హీర్ ఖాన్ ఎంపికైన‌ట్లు ఆ ఫ్రాంచైజీ తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక వీడియోను విడుద‌ల చేసింది. 

గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో జ‌హీర్ కోచింగ్ స్టాఫ్‌లో కనిపించాడు. 2018 నుంచి 2022 వరకు ఆ టీమ్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా పనిచేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఖాళీ చేసి వెళ్లిన‌ ఎల్‌ఎస్‌జీ మెంటార్ పోస్టులో జహీర్ ఖాన్ నియామ‌కం జ‌రిగింది. 

గౌతీ ఐపీఎల్ 2022-23లో లక్నోకు మెంటార్‌గా ఉన్నాడు. అయితే 2024లో ఆ ఫ్రాంచైజీని విడిచిపెట్టిన గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)కు మెంటార్‌గా కనిపించిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి ఇటీవ‌లే టీమిండియా సీనియ‌ర్ జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా వెళ్లాడు గౌతీ.  

ఇక జహీర్ ఖాన్ త‌న‌ ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. మొత్తంగా 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ముంబయికి కోచింగ్ స్టాఫ్‌గా పనిచేశాడు. ఇప్పుడు మెంటార్ అవ‌తారంలో కనిపించనున్నాడు.

Zaheer Khan
Lucknow Super Giants
Mentor
Cricket
Sports News
  • Loading...

More Telugu News