West Indies vs South Africa: స‌ఫారీల‌కు విండీస్ షాక్‌.. సిరీస్ కైవ‌సం!

West Indies vs South Africa 2nd T20I at Brian Lara Stadium in Trinidad

  • మూడు టీ20ల సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న విండీస్‌
  • ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో ఆతిథ్య జ‌ట్టు ఘ‌న విజ‌యం
  • స‌ఫారీల‌పై విండీస్‌కు ఇది వ‌రుస‌గా మూడో టీ20 సిరీస్ విజ‌యం

వెస్డిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మూడు టీ20ల సిరీస్‌ను ఆతిథ్య జ‌ట్టు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే గెలుచుకుంది. ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో విండీస్ విజ‌యం సాధించ‌డంతో సిరీస్ కైవ‌సం చేసుకుంది. వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో సిరీస్‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం. 

మొదట టాస్ గెలిచి విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది ద‌క్షిణాఫ్రికా. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన క‌రేబియ‌న్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో షై హోప్ 41, కెప్టెన్ రోమ‌న్ పావెల్ 35, రూథ‌ర్‌ఫోర్డ్ 29 ప‌రుగుల‌తో రాణించారు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో విలియ‌మ్స్ 3, ప్యాట్రిక్ క్రూగ‌ర్ 2, బార్త్‌మ‌న్ ఒక వికెట్ తీశారు. 

అనంత‌రం 180 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ ప్రారంభించిన స‌ఫారీలు 149 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యారు. రీజా హెండ్రిక్స్ 18 బంతుల్లోనే 44 ప‌రుగులు (6 ఫోర్లు, 2 సిక్సులు), స్ట‌బ్స్ 28 ప‌రుగులు చేసి విజ‌యంపై ఆశ‌లు పెంచినా.. మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ద‌క్షిణాఫ్రికాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. 

విండీస్ బౌల‌ర్ల‌లో జోసెఫ్‌, షెప‌ర్డ్ త‌లో మూడు వికెట్లు, హుస్సేన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్ట‌డి చేశారు. దీంతో క‌రేబియ‌న్ జ‌ట్టు 30 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. కాగా, ద‌క్షిణాఫ్రికాపై విండీస్‌కు ఇది వ‌రుస‌గా మూడో టీ20 సిరీస్ విజ‌యం.

West Indies vs South Africa
2nd T20I
Brian Lara Stadium
Trinidad
Cricket
Sports News
  • Loading...

More Telugu News