జైల్లో కవితను కలిసిన హరీశ్ రావు, రవిచంద్ర

Harish Rao meets Kavitha in Tihar jail
  • జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత
  • ఎయిమ్స్‌లో నిన్న చికిత్స అందించిన జైలు అధికారులు
  • ఈ నెల 27న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్ర కలిశారు. కాగా, కవిత జ్వరంతో బాధపడుతున్నారు. జైలు అధికారులు నిన్న ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందించారు. ఈ నెల 27న కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కేసులో ఐదు నెలల క్రితం అరెస్టైన కవిత నాటి నుంచి జైల్లోనే ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ... బెయిల్ రాలేదు.
Go Back to Shorts
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News