Agra: పార్కింగ్ లో ఆడుకుంటున్న పాపపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో!

Toddler Dies After Being Run Over by Car In Agra Parking Lot Shocking Video
  • ఆగ్రాలో తల్లిదండ్రుల కళ్లెదుటే ప్రమాదం
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ చిన్నారి మృత్యువాత
ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది.. షాపింగ్ మాల్ పార్కింగ్ లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపైకి కారు దూసుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన పాప ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయింది. అక్కడే ఉన్న పాప తల్లిదండ్రులు గమనించేలోగానే ఘోరం జరిగిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో చూపరులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు.. ఆగ్రాలోని కాస్మోస్ మాల్ కార్ పార్కింగ్ లో ఆగస్టు 6న జరిగిన ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది.

మాల్ లో షాపింగ్ పూర్తిచేసుకుని పాపతో పార్కింగ్ ఏరియాలోకి వచ్చిన తల్లిదండ్రులు ఏదో విషయంపై మాట్లాడుకుంటున్నారు. పాప అక్కడే తిరుగుతూ ఆడుకుంటోంది. ఇంతలో ఓ కారు లోపలికి రావడం, పార్కింగ్ కోసం రివర్స్ చేసుకోవడం చూడొచ్చు. పాప ఆడుకుంటూ ఆ కారు ముందుకు రావడం గమనించని డ్రైవర్.. కారును ముందుకు కదిలించాడు. దీంతో పాప కింద పడిపోగా కారు ముందు టైర్ పైకెక్కింది. పాప ఏడుపుతో తల్లి ఈ ఘోరాన్ని గమనించింది. హడావుడిగా అదే కారులో పాపను ఆసుపత్రికి తరలించారు. అయితే, పాపను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు.
Agra
Parking Lot
Car Accident
Toddler Dead
Viral Videos

More Telugu News