New Airports: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Union Minister Ram Mohan Naidu said that they will look into setting up new airports in Telangana
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానయాన భద్రతా వారోత్సవం
  • హాజరైన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు చంద్రబాబే ఆద్యుడని వెల్లడి 
హైదరాబాదులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నేడు విమానయాన భద్రత వారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారా చంద్రబాబునాయుడు హయాంలోనే శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు అంకురార్పణ జరిగిందని అన్నారు. చంద్రబాబు విజన్ కారణంగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగిందని వివరించారు. 

నాడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భూమి కేటాయించిన సమయంలో, అంత భూమి ఎందుకు కేటాయించారని కొందరు విమర్శించారని తెలిపారు. ఇప్పుడీ విమానాశ్రయం ఎంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. 

ఇక, తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు పరిశీలిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

విమానయాన భద్రతా వారోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రామ్మోహన్ నాయుడు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మొక్కలు నాటారు. అందరూ మొక్కలు నాటాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు అని, పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని వివరించారు.
New Airports
Telangana
Shamshabad Airport

More Telugu News