ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఎంపిక
- ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
- ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల
- వైసీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం బొత్స పేరు ప్రకటించిన జగన్
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో... ఆగస్టు 6న నోటిఫికేషన్, అదే రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో... విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్లు, జెడ్పీ, ఎంపీపీ సభ్యులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.