Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Telangana High Court Reliefs TDP MLA Raghurama Krishna Raju

  • ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియ కేసు
  • రఘురామకృష్ణరాజు ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ ప్రొసీడింగ్స్
  • వాటిని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఎస్‌బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

ఈ కేసులో ప్రతివాదులైన రిజర్వు బ్యాంక్, ఎస్‌బీఐలకు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే, ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ డైరెక్టర్ కె.సీతారామం ఖాతాను కూడా మే 28న ఇలాగే మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ ప్రొసీడింగ్స్ జారీచేసింది. తాజాగా, ఆయనకు కూడా ఊరట కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Raghu Rama Krishna Raju
Telugudesam
Ind-barath Power Gencom Limited
Telangana High Court
  • Loading...

More Telugu News