Nawaz Basha: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు నోటీసులు

Notice issued to YCP ex MLA Nawaz Basha in Madanapalle incident

  • ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్ధమైన ఫైళ్లు
  • ఇందులో కుట్రకోణం ఉండొచ్చని భావిస్తున్న ప్రభుత్వం
  • ప్రస్తుతం బెంగళూరులో ఉన్న నవాజ్ బాషా... ఇంట్లో నోటీసులు అందించిన అధికారులు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు నోటీసులు జారీ అయ్యాయి. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రస్తుతం బెంగళూరులో ఉండడంతో, విచారణ అధికారులు మదనపల్లెలోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఇంట్లో నోటీసులు ఇచ్చిన విషయాన్ని బెంగళూరులో ఉన్న నవాజ్ బాషాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. 

మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దగ్ధమైన ఫైళ్లలో చాలావరకు భూములకు సంబంధించినవేనని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భూ అక్రమాలకు సంబంధించిన కుట్ర కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు... డీజీపీ, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ లను అప్రమత్తం చేశారు. వారిని వెంటనే మదనపల్లె వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కూడా మదనపల్లె వెళ్లి పలు తనిఖీలు చేశారు.

Nawaz Basha
Madanapalle Incident
Sub Collectorate
YSRCP
  • Loading...

More Telugu News